TG : హైదరాబాద్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శనివారం 78వ పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. దీక్షాంత్ పరేడ్లో మొత్తం 151 మంది ఆఫీసర్ ట్రైనీలు పాల్గొన్నారు. వీరిలో 135 మంది ఐపీఎస్ అధికారులు కాగా, నేపాల్, భూటాన్, మాల్దీవులకు చెందిన 16 మంది విదేశీ అధికారులు ఉన్నారు.