🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 17 October 2026, 2:27 pm Posted by : Telangana Gontuka

వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిపై కేసులు.. పుంగనూరులో భారీగా పోలీసుల మోహరింపు

News Image
పుంగనూరు : అన్నమయ్య జిల్లా పుంగనూరులో నామినేషన్‌ కేంద్రం వద్ద జరిగిన గొడవలపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సహా పలువురిపై కేసులు నమోదైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన దాడి దృశ్యాలను పరిశీలించిన పోలీసులు సుమారు 70 మందిని గుర్తించినట్లు తెలుస్తోంది. గొడవల్లో పాల్గొన్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పుంగనూరులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
🏠 Home