🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 17 October 2026, 1:42 pm Posted by : Telangana Gontuka

ఆర్మూర్‌–జగిత్యాల–మంచిర్యాల హైవేకు గ్రీన్‌ సిగ్నల్‌

News Image
TG : ఆర్మూర్‌ నుంచి జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు 131 కి.మీ. మేర నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి రూ.10 వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం. ఎన్‌హెచ్‌-63 అభివృద్ధితో ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగుపడి, ప్రయాణ సమయం తగ్గనుంది. ప్రాజెక్టుకు నిజామాబాద్‌ జిల్లాలో 5.4262, మంచిర్యాల జిల్లాలో 6.8535, జగిత్యాల జిల్లాలో 3.9067 హెక్టార్ల భూమి అవసరమని పేర్కొన్నారు. రహదారి పూర్తయితే వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలకు ఊతం లభించనుంది.
🏠 Home