TG : విజయదశమి రోజు శమీ చెట్టు ఆకులను బంగారంగా భావించి ఒకరికొకరు పంచుకోవడం వెనుక పురాణ విశ్వాసాలు ఉన్నాయి. మహాభారతంలో పాండవులు తమ ఆయుధాలను శమీ చెట్టుపై దాచినట్లు, విజయదశమి రోజున వాటిని తీసుకుని యుద్ధానికి వెళ్లినట్లు కథనం. శమీ పూజ విజయానికి చిహ్నంగా భావిస్తారు. కౌత్సుడు, రఘు మహారాజు, కుబేరుడికి సంబంధించిన పురాణ కథలో శమీ చెట్లపై బంగారం కురిసినట్లు చెబుతారు. అందుకే శమీ ఆకులను ‘స్వర్ణ పత్రాలు’గా భావించి పంచుకుంటూ, ఎదుటివారికి విజయం, సిరిసంపదలు కలగాలని ఆశీర్వదిస్తారు. శమీ చెట్టును శనితోనూ అనుసంధానించే జ్యోతిష విశ్వాసం ఉంది. ఈ ఆచారం భక్తి, శుభం, విజయానికి ప్రతీకగా కొనసాగుతోంది.