🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 16 October 2026, 8:19 am Posted by : Marupatla venu

జఫర్‌గఢ్‌ నూతన ఎస్సైగా బొల్లం వినయ్‌కుమార్‌

News Image
JNG : జఫర్‌గఢ్‌ నూతన ఎస్సైగా బొల్లం వినయ్‌కుమార్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఎస్సైగా పనిచేసిన రామారావు మడికొండకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. నూతన ఎస్సైకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
🏠 Home