తమిళనాడు: కన్యాకుమారి జిల్లా కుళచ్చల్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్లుగా ప్రేమించుకున్న రూబెన్ (31), కేరళలోని పారశాలకు చెందిన 26 ఏళ్ల యువతి సోమవారం వివాహం చేసుకున్నారు. తిరువనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్న యువతికి ఫేస్బుక్ ద్వారా రూబెన్ పరిచయమయ్యాడు. పెళ్లి రిసెప్షన్లో రూబెన్ మద్యం సేవించి, వధువు తండ్రిని భుజాలపై ఎత్తుకోవడంతో మొదలైన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. అడ్డుకునేందుకు వచ్చిన భార్యపై, ఆమె తండ్రిపై రూబెన్ చేయి చేసుకున్నట్లు సమాచారం. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లారు.