🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 15 October 2026, 11:11 am Posted by : Telangana Gontuka

ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు

News Image
తిరుమల : నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ముత్యపుపందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్భంగం ఘట్టాన్ని తలపించేలా శ్రీవారు శ్రీరాముడిగా, అమ్మవార్లు సీతా లక్ష్మణుల అలంకారంలో దర్శనమివ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గోవింద నామస్మరణలతో తిరుమల మాడ వీధులు మార్మోగాయి. వివిధ కళాబృందాల ప్రదర్శనల మధ్య వైభవంగా సాగిన వాహనసేవలో టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్రతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
🏠 Home