🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 14 October 2026, 9:33 pm Posted by : Marupatla venu

మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవకాశం కల్పించండి.... తాటికాయల రాజేందర్

News Image
జఫర్‌గడ్: అక్టోబర్ 14 (తెలంగాణ గొంతుక) స్టేషన్ ఘన్‌పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాటికాయల రాజేందర్ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు అని.మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించడంతో, సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా తన సేవలను గుర్తించి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనకు అవకాశం కల్పిస్తారని రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.2012 నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను విడవకుండా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నానని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని,తనపై కేసులు నమోదై జైలు జీవితం అనుభవించాల్సి వచ్చినప్పటికీ భయపడకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశానని పేర్కొన్నారు. ఆర్థికంగా నష్టాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీని వీడలేదని స్పష్టం చేశారు.గతంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా, మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశానని తెలిపారు. అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజా సమస్యలపై పోరాటం చేశానని చెప్పారు.జఫర్‌గడ్‌ను వరంగల్ జిల్లాలో కలపాలని పోరాటం,2019 ఎంపీటీసీ ఎన్నికల్లో జఫర్‌గడ్ ఎంపీటీసీ-2 స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యానని రాజేందర్ గుర్తుచేశారు.తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కీలకంగా పనిచేశానని తెలిపారు, మండలాన్ని అప్పట్లో వరంగల్ జిల్లా నుంచి తొలగించి జనగామ జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ,తిరిగి వరంగల్ జిల్లాలో కలపాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మూడు నెలల పాటు ధర్నాలు,రాస్తారోకోలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఉద్యమ క్రమంలో తనపై కేసులు నమోదై రెండుసార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని, ఇప్పటికీ కోర్టుకు హాజరవుతున్నానని వివరించారు. అయినప్పటికీ పార్టీ జెండాను విడవకుండా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తున్నానని పేర్కొన్నారు.నియోజకవర్గంలో జరిగిన వివిధ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి తన వంతు కృషి చేశానని.ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య కి మండలం నుంచి భారీ మెజారిటీ రావడానికి పార్టీ శ్రేణులతో కలిసి పనిచేశానని చెప్పారు.సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశానని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీని దేశ ప్రధానమంత్రిగా చూడాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నేటికీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నానని తెలిపారు.
తన రాజకీయ ప్రస్థానం, పార్టీ పట్ల చూపిన విధేయత, ప్రతికూల పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ జెండాను విడవకుండా చేసిన సేవలను గుర్తించి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నట్లు తాటికాయల రాజేందర్ తెలియజేశారు
🏠 Home