HYD : తెలంగాణలో మీసేవా ధ్రువపత్రాల భద్రత, మన్నిక పెంచేందుకు కొత్తగా టియర్ రెసిస్టెంట్ సెక్యూర్డ్ బేస్ స్టేషనరీని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రారంభించారు. ప్రత్యేక పేపర్‌తో రూపొందించిన ఈ సర్టిఫికెట్లు నీటిని, చిరిగిపోవడాన్ని తట్టుకోవడంతో పాటు 15 అధునాతన భద్రతా లక్షణాలను కలిగి ఉంటాయి. జనన, మరణ ధ్రువపత్రాలు సహా కీలక పత్రాలు ఎక్కువకాలం భద్రంగా ఉండేందుకు ఈ విధానం దోహదపడనుంది. సాధారణ పరిస్థితుల్లో దీర్ఘకాల భద్రత కోసం లామినేషన్ అవసరాన్ని కూడా తగ్గించనుంది.