🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 14 October 2026, 10:13 am Posted by : Telangana Gontuka

ఉప్పల్‌ టీ20 మ్యాచ్‌కు పటిష్ట బందోబస్తు.. 2,200 మంది పోలీసులతో భద్రత!

News Image
HYD : హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో అక్టోబర్‌ 14న రాత్రి 7 గంటలకు జరిగే భారత్‌–వెస్టిండీస్‌ నాలుగో టీ20 మ్యాచ్‌కు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మల్కాజ్‌గిరి పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో 2,200 మంది సిబ్బందిని మోహరించారు. స్టేడియంలోని 408 సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు మహిళలు, పిల్లలు, ప్రేక్షకులు, ఆటగాళ్ల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
🏠 Home