HYD : ప్రముఖ మౌలిక వసతుల సంస్థ నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఎన్‌సీసీ) వ్యవస్థాపక చైర్మన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు (90) హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. 1978లో ఎన్‌సీసీని స్థాపించి దేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. సాగు, తాగునీటి పథకాలు, రైల్వేలు, భవన నిర్మాణం సహా పలు రంగాల్లో సంస్థ విస్తరణకు కృషి చేశారు. మౌలిక రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్రం 2010లో పద్మశ్రీతో సత్కరించింది.