TG : తెలంగాణ క్యాడర్‌లో పనిచేయాలనే లక్ష్యంతో ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి మరోసారి న్యాయపోరాటం చేస్తున్నారు. తనను తెలంగాణకు కేటాయించాలంటూ క్యాట్ గతంలో ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు విధించిన మధ్యంతర స్టేను ఎత్తివేయాలని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తుది తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు అనంతరం ఆమె ఏ క్యాడర్‌లో పనిచేస్తారనే దానిపై స్పష్టత రానుంది.