🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 13 October 2026, 6:40 pm Posted by : Telangana Gontuka

రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహశీల్దార్‌, సర్వేయర్‌

News Image
రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్‌ బోడ సుదర్శన్‌రెడ్డి, మండల సర్వేయర్‌ బటుక శ్రీనివాసులు రూ.20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. లేఅవుట్‌ క్లియరెన్స్‌ నివేదిక కోసం తొలుత రూ.30 లక్షలు డిమాండ్‌ చేసి, చివరకు రూ.20 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. లంచం నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇద్దరి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది.
🏠 Home