న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ జంతర్‌మంతర్ వద్ద ‘ఇండియా’ కూటమి నిర్వహించిన మహా ధర్నాలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిరసనలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.