వరంగల్: న్యూఢిల్లీలోని భారత్ మండపంలో అక్టోబర్ 12 నుంచి 14 వరకు జరుగుతున్న 12వ జాతీయస్థాయి ఇన్‌స్పైర్ మనక్ ప్రాజెక్టుల పోటీల్లో వర్ధన్నపేటకు చెందిన వన్నాల రష్మిత ప్రతిభ చాటింది. ‘సైకిల్‌తో చెత్త సేకరణ’ ప్రాజెక్టును ప్రదర్శించి న్యాయనిర్ణేతలు, సందర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలంగాణ నుంచి 52 ప్రాజెక్టులు పోటీల్లో పాల్గొన్నాయి. రష్మిత ప్రతిభపై అధికారులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.