🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 12 October 2026, 7:57 pm Posted by : Marupatla venu

ప్రభుత్వ భూములకు హద్దు రాళ్లు నిర్ణయించండి

News Image
జఫర్గడ్; అక్టోబర్ 12 (తెలంగాణ గొంతుక) మండలంలోని షాపెల్లి గ్రామంలో నీ సర్వేనెంబర్ 54 లో ఉన్న మూడు ఎకరాల గ్రామకంఠం భూమితో పాటు సర్వే నెంబర్135 లోని రెండు ఎకరాల 24 గంటల ఇనాం భూమిని రెవెన్యూ అధికారులు రీ సర్వే ద్వారా పరిశీలించి ప్రభుత్వ భూములుగా గుర్తించి భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని కోరుతూ గ్రామస్తులు తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ తాళ్లపల్లి నరేష్ గౌడ్ మాట్లాడుతూ సర్వే నెంబర్ 135 లో రెండు ఎకరాల 24 గంటల ఇనాం భూమిని , అదేవిధంగా 54 సర్వే నెంబర్ లోని 3 ఎకరాల గ్రామ కంఠం భూమినీ సర్వే చేసి నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమిగా గుర్తించి వీటికి ప్రత్యేక సర్వే నెంబర్ కేటాయించాలని కోరారు అలాగే ఈ 54, 135 సర్వే నెంబర్ల లోని భూములకు సంబంధించి రెవెన్యూ, ఆర్డీవో, కోర్టులో భూ వివాదం పెండింగ్ లో ఉన్నందున న్యాయపరమైన అంశాలను పరిగణలోనికి తీసుకొని రీ సర్వే చేసి సంబంధిత వివాదాల పరిష్కారం రెవెన్యూ అధికారుల పరిశీలన పూర్తయ్యే వరకు నిబంధనలకు విరుద్ధంగా ఎవరు పేరుమీద ఈ భూములను నమోదు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తాహసిల్దార్ కు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాచర్ల సోమయ్య, శివరాత్రి కుమారస్వామి, కాసర్ల సోమ నరసయ్య, లింగంపల్లి దామోదర్, తాళ్ల పెళ్లి స్వామి, తాళ్లపల్లి వెంకటయ్య, తాళ్లపల్లి సురేష్, లింగంపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు
🏠 Home