న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఏఐ స్మార్ట్ గ్లాసెస్‌తో సరికొత్త చెల్లింపుల సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. షాపింగ్ సమయంలో ఫోన్ బయటకు తీయకుండానే గ్లాసెస్‌తో QR కోడ్‌ను గుర్తించి, వాయిస్ కమాండ్ ద్వారా UPI చెల్లింపులు చేయవచ్చు. ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.5,000, నెలకు రూ.15,000 వరకు చెల్లింపులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్ లభ్యత, పరిమితులపై అధికారిక వివరాలను నిర్ధారించుకోవాల్సి ఉంది.