అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 251 విడుదల చేసింది. మున్సిపాలిటీలు, పట్టణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అమలుకు మార్గదర్శకాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.