విజయవాడ: దసరా శరన్నవరాత్రుల తొలి రోజైన ఆదివారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ బాలా త్రిపురసుందరి దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు బాలార్చన నిర్వహిస్తారు. రెండేళ్ల నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి, కొత్త బట్టలు సమర్పిస్తారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు అలంకరించి, పాయసం, గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు.