🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 11 October 2026, 6:48 pm Posted by : Telangana Gontuka

విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్‌.. సస్పెన్షన్‌

News Image
ఎటావా: ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలో విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించిన అసిస్టెంట్‌ టీచర్‌ దినేశ్‌ కుమార్‌ సస్పెండ్‌ అయ్యారు. బిరౌలి పాఠశాలలో ఓ విద్యార్థిని తన కాళ్ల మధ్య కూర్చోబెట్టుకుని, అతడి గుండుపై తబలా వాయిస్తున్నట్లు నటిస్తూ నవ్విన వీడియోను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వీడియో వైరల్‌ కావడంతో టీచర్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అధికారులు చర్యలు తీసుకుని ఆయనను సస్పెండ్‌ చేశారు.
🏠 Home