🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 10 October 2026, 10:17 am Posted by : Marupatla venu

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు ఎంపీ డాక్టర్ కడియం కావ్య

News Image

జనగాం ; అక్టోబర్ 10 పువ్వులను శివ పూజిస్తూ.. ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవానికి, ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆకాంక్షించారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే తొమ్మిది రోజుల పూల పండుగను పురస్కరించుకుని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ ఎంపీ డాక్టర్ కడియం కావ్య హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ప్రకృతిలోని ప్రతి పువ్వులో అందాన్ని, ప్రతి జీవిలో జీవన సౌందర్యాన్ని దర్శించే గొప్ప పండుగ బతుకమ్మ అని ఎంపీ పేర్కొన్నారు. ప్రకృతి ఒడిలో విరబూసే తీరొక్క పూలను సేకరించి, అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు, ఆటలతో మహిళలు జరుపుకునే ఈ పండుగ తెలంగాణ అస్తిత్వానికి, మన సంస్కృతీ వైభవానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు.

బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదని, తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు, కుటుంబ బంధాలకు, ప్రకృతితో మనకున్న విడదీయలేని అనుబంధానికి ప్రతీక అని తెలిపారు. తరతరాలుగా వస్తున్న ఈ అద్భుతమైన సంప్రదాయాన్ని కాపాడుకుంటూ, భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.

తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాలు ప్రతి ఇంటా ఆనందాన్ని, ప్రతి కుటుంబంలో సంతోషాన్ని, ప్రతి హృదయంలో కొత్త ఆశలను నింపాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆకాంక్షించారు. పల్లెలు, పట్టణాలు పూల పరిమళాలతో, సంప్రదాయ గీతాలతో కళకళలాడాలని, మహిళలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.

ప్రకృతిని ప్రేమిస్తూ, మన సంస్కృతిని గౌరవిస్తూ, తెలంగాణ పండుగల గొప్పతనాన్ని చాటిచెప్పే బతుకమ్మ వేడుకలను ప్రజలందరూ కలిసికట్టుగా, సంతోషంగా జరుపుకోవాలని ఎంపీ పిలుపునిచ్చారు.

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో బతుకమ్మ పూల పరిమళాల్లా సంతోషాలు విరబూయాలని, ప్రతి ఇంటా సిరిసంపదలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరోసారి ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.
🏠 Home