ప్రకృతిని పూజించే సంస్కృతి ప్రపంచంలో తెలంగాణలోనే ప్రత్యేకం : ఎస్‌ఆర్ జోనల్ ఇన్‌చార్జి రాజేశ్వర్‌రెడ్డి
ప్రకృతే దైవం.. పూలే పూజా సామగ్రి..
బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుంది. తంగేడు, గునుగు, బంతి వంటి కాలానుగుణ పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పూజించడం ఈ పండుగ ప్రత్యేకత. పితృ అమావాస్య అనంతరం ప్రారంభమయ్యే ఎంగిలిపూల బతుకమ్మతో తొమ్మిది రోజుల పూల పండుగకు శ్రీకారం చుడతారు. విద్యార్థులకు ఈ సంప్రదాయం గొప్పతనాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో పాఠశాలలో ముందస్తుగా వేడుకలు నిర్వహించారు.
సంప్రదాయాలను భావితరాలకు అందించాలి..
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్‌ఆర్ జోనల్ ఇన్‌చార్జి రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతిని ఆరాధించే గొప్ప సంప్రదాయం మనదని, పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను కొలవడం తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని తెలిపారు. ఇలాంటి వేడుకల ద్వారా విద్యార్థుల్లో మన సంప్రదాయాలపై గౌరవం, ప్రకృతి పట్ల ప్రేమ పెరుగుతాయని పేర్కొన్నారు. వేడుకలను నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.
ఆటపాటలతో అలరించిన విద్యార్థినులు..
పాఠశాల ప్రాంగణాన్ని పూలు, సంప్రదాయ తోరణాలతో అలంకరించారు. బతుకమ్మ పాటలకు విద్యార్థినులు చేసిన నృత్యాలు, ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వందన, వైస్ ప్రిన్సిపాల్ శైలజ, పీఈటీలు యుగంధర్, షరీఫ్, నాగరాజు, మమత, ఆనంద్, రమణ, రత్నాకర్, శశికుమార్, వర్షిణి, సుమన్, శ్రీనివాస్‌రెడ్డి, రత్నకిషోర్, కుమారస్వామి, రెహనా, లక్ష్మి, సంయుక్త, శ్రీలత, రజిత, అరవింద, కవిత, రహీమున్నీసా, నవనీత, రాధిక, డాన్స్ మాస్టర్ భరద్వాజ్‌తోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.