దేశ రక్షణలో భారత వాయుసేన అందిస్తున్న సేవలను స్మరించుకునే రోజు ఇది. సరిహద్దులు, గగనతలాన్ని కాపాడటంతో పాటు యుద్ధ సమయాల్లో, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు వాయుసేన అందిస్తున్న సేవలు అమూల్యం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు ఘన నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. సైనికులు, మాజీ సైనికుల సేవలను స్మరించుకుంటూ భారత వాయుసేన దినోత్సవ శుభాకాంక్షలు. 🇮🇳