న్యూఢిల్లీ : ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. కన్నాట్ ప్లేస్లో ఇండియా కూటమి ఎంపీల లంచ్ మీటింగ్ జరగనున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, ఆప్, శివసేన (యూబీటీ), ఆర్జేడీ, సీపీఐ, ఎన్సీపీకి చెందిన ఎంపీలు సమావేశానికి హాజరుకానున్నారు. సమావేశం అనంతరం నిరసనలు చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.