🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 08 October 2026, 4:58 pm Posted by : Telangana Gontuka

గుండెపోటు కాదు.. భర్తను హత్య చేసిన భార్య!

News Image
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. భర్త తాహిర్‌ (30) గుండెపోటుతో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు చేసిన భార్య ఇల్మా (27)పై హత్య ఆరోపణలు నమోదయ్యాయి. బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న ఇల్మాకు స్టూడియో యజమాని అమన్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భర్తను అడ్డుగా భావించి ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి చున్నీతో గొంతునులిమి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాహిర్‌ ఫోన్‌లో బయటపడిన వాట్సాప్‌ చాటింగ్‌తో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇల్మాను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సమాధి నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయనున్నారు.
🏠 Home