వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన మైదం గౌరమ్మ (88) మృతి చెందడంతో ఆమె కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు గురువారం పరామర్శించారు. మండల పార్టీ అధ్యక్షుడు పోశాల వెంకన్నగౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎద్దు సత్యం కుటుంబ సభ్యులను ఓదార్చి 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. కుటుంబానికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మైదం బుచ్చిమల్లు, మైదం బాబు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.