మంచిర్యాల జిల్లాకు చెందిన కొంతమంది కోర్టు కానిస్టేబుల్స్‌పై రామగుండం పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. జనవరి 2024 నుంచి జూన్ 2026 వరకు పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చలాన్, ఫైన్ వివరాల్లో ఆన్లైన్, ఆఫ్‌లైన్ నమోదుల మధ్య భారీ తేడాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సీపీ సీరియస్‌గా స్పందించి 16 మంది కానిస్టేబుల్స్‌లో కొందరికి మెమోలు జారీ చేయగా, మరికొందరిని సస్పెండ్ చేసినట్లు సమాచారం.