పట్నా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానాన్ని 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు తాకింది. దీంతో విమానం ముందు భాగం దెబ్బతిని, కొంత భాగం లోపలికి చొచ్చుకుపోయినట్లు సమాచారం. ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. విమానంలో 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా, లక్నో ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అందరూ సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.