వర్ధన్నపేటలో దళిత యువతి చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరింది. చైర్మన్ కుమారుడు తనను వివాహం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి రాత్రింబవళ్లు చైర్మన్ ఇంటి ఎదుటే ఆమె ఆందోళన కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రతిపక్షాలు అండగా నిలవగా.. అధికార పార్టీ నేతలు సైతం మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం, ఎమ్మెల్యే స్పందించి న్యాయం చేయాలని యువతి పట్టుబడుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకటిస్తామని నేతలు వెల్లడించడంతో.. నేడు ఏం జరగబోతోంది? ఎలాంటి నిర్ణయం వెలువడనుంది? అన్నది వర్ధన్నపేటలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.