హైదరాబాద్: నిర్మల్ జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు సుంచు ఎల్లయ్యతో పాటు ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో బుధవారం టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సర్పంచులు టేకం లక్ష్మణ్, గడ్డం భీముడు, కె. రాజేందర్, కస్తూరి అర్జున్, శ్రీపెల్లి శేఖర్, ఉపసర్పంచులు పి.రాజు, చింటు కాంతి, గంపల భూమన్న, మాజీ ఎంపీటీసీ సభ్యులు రామ్‌సింగ్, షిండే సదాశివ, మాజీ సర్పంచులు ఎ.శంకర్, నాయకపోడ్, కోలం సంఘాల ప్రముఖులు, నాయకులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. నిర్మల్ జిల్లా, ఖానాపూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని కవిత సూచించారు. ఈ నెలలో ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.