మహబూబ్‌నగర్: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా 25 ఏళ్ల ప్రజా సేవను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా బుధవారం మహబూబ్‌నగర్‌లో ‘సేవా జ్యోతి యాత్ర’ నిర్వహించారు. అంబేద్కర్ కళాభవన్‌లో మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రసంగాలను కార్యకర్తలతో కలిసి వీక్షించిన అనంతరం కాగడాలతో అంబేద్కర్ కళాభవన్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కార్పొరేటర్లు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.