విజయవాడ: ఏపీఎస్‌ఆర్టీసీ అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి పథకం’లో చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. ఈ పథకం ద్వారా మహిళలు ఇప్పటివరకు 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు చేశారు. రోజుకు సగటున 24 లక్షల ఉచిత ప్రయాణాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మహిళలకు సుమారు రూ.3,500 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరినట్లు పేర్కొన్నారు. పథకం విజయవంతంగా అమలవుతున్నందుకు సహకరిస్తున్న ఆర్టీసీ సిబ్బందిని ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అభినందించారు.