తిరుమల : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అక్టోబర్ 7న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. అక్టోబర్ 11 నుంచి 20 వరకు ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్‌ఆర్‌ఐ, డిఫెన్స్ దర్శనాలను రద్దు చేసింది. అక్టోబర్ 10 నుంచి 19 వరకు వీఐపీ బ్రేక్ సిఫార్సు లేఖలను కూడా స్వీకరించబోమని తెలిపింది. అధిక రద్దీ దృష్ట్యా భక్తులు యాత్రను అందుకు అనుగుణంగా రూపొందించుకోవాలని టీటీడీ కోరింది.