🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 06 October 2026, 7:09 pm Posted by : Telangana Gontuka

సైద్ధాంతిక పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక అవగాహన అవసరం

News Image
హైదరాబాద్‌: విద్యార్థులకు సైద్ధాంతిక పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక అవగాహన అవసరమని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి. బాలకిష్టారెడ్డి అన్నారు. మసబ్‌ట్యాంక్‌లోని మండలి కార్యాలయంలో రాజేంద్రనగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సామ రవీందర్‌రెడ్డి రచించిన ‘సూక్ష్మ ఆర్థిక శాస్త్రం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. బీఏ ప్రథమ సంవత్సరం ప్రథమ సెమిస్టర్‌ విద్యార్థులకు ఉపయోగపడేలా పుస్తకాన్ని రూపొందించినట్లు తెలిపారు. అధ్యాపకులు బోధనా అంశాలపై పుస్తక రచనలు, పరిశోధనలు విస్తృతం చేయాలని బాలకిష్టారెడ్డి సూచించారు. రవీందర్‌రెడ్డిని అభినందించిన ఆయన ‘ఎ హబ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, రీసెర్చ్‌, ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌’ పుస్తకాన్ని బహూకరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
🏠 Home