ఇల్లందు: ఇల్లందు కూరగాయల మార్కెట్ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య సందర్శించారు. మార్కెట్లో వ్యాపారుల వద్దకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యాపార పరిస్థితులు, లాభనష్టాలపై ఆరా తీశారు. మార్కెట్లో నెలకొన్న సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కార మార్గాలు చూపాలని కమిషనర్‌ను ఆదేశించారు. అనంతరం నూతనంగా ఏర్పాటైన మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.