🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 06 October 2026, 1:59 pm Posted by : Telangana Gontuka

చంద్రబాబు–పవన్‌ కీలక భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్

News Image
అమరావతి: ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మంగళవారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో కీలకంగా భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో టీడీపీ–జనసేన మధ్య సీట్ల సర్దుబాటు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవుల పంపకం, కూటమి సమన్వయం తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తర్వాత మూడు పార్టీల నేతలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమావేశానికి మంత్రి నారా లోకేశ్‌ కూడా హాజరయ్యారు.
🏠 Home