🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 06 October 2026, 12:03 pm Posted by : Telangana Gontuka

జిల్‌..జిగా..జిగా.. ఐదు నిమిషాల్లో కోట్ల దోపిడీ!

News Image
మేడ్చల్‌: మేడిపల్లిలోని క్యారెట్‌లేన్‌ డైమండ్‌ జ్యువెలరీ షోరూమ్‌లో మాస్క్‌ గ్యాంగ్‌ మెరుపు చోరీ కలకలం రేపింది. తెల్లవారుజామున షట్టర్‌ ధ్వంసం చేసి లోపలికి చొరబడిన దుండగులు డిస్‌ప్లే గ్లాస్‌లు పగులగొట్టి బంగారు, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు. ప్రాథమికంగా ఏడుగురు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఒక్కరు లోపలికి వెళ్లగా.. ఆరుగురు బయట కాపలా కాసినట్లు తెలుస్తోంది. రూ.2 కోట్లకుపైగా నష్టం జరిగి ఉండొచ్చని అంచనా. రాజస్థాన్‌కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా హస్తం ఉండొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. క్లూస్‌, డాగ్‌ స్క్వాడ్‌లతో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు పరిసర ప్రాంతాల సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. ముందస్తు రెక్కీ జరిగిందా? విలువైన నగల సమాచారం ఎవరిచ్చారు? అన్న కోణాల్లోనూ విచారణ కొనసాగుతోంది.
🏠 Home