🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 06 October 2026, 11:44 am Posted by : Telangana Gontuka

ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్‌ పాదయాత్ర

News Image
హన్మకొండ: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్‌, ఇండియా కూటమి ఆధ్వర్యంలో సోమవారం హన్మకొండలో భారీ పాదయాత్ర నిర్వహించారు. అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు సాగిన కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. ఓటు చోరీ, ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారంటూ సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ఆరోపణలు చేస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనన్నారు. అనంతరం నాయకులు సీఈసీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
🏠 Home