వర్ధన్నపేట: గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ గోపాలపూర్‌లోని ఆర్కాసాయికుంటలో బతుకమ్మ నిర్వహణకు ఏర్పాటు చేయనున్న స్థలాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మంగళవారం పరిశీలించారు. బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు, రహదారుల పరిస్థితిని పరిశీలించారు. స్థల అభివృద్ధికి అవసరమైన పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.