రాయపర్తి: మండలంలోని మైలారం గ్రామం మొదటి వార్డులో బొడ్డెమ్మ ఆడే మహిళలకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డీజే బాక్స్ సెట్‌ను అందజేశారు. మహిళల విజ్ఞప్తి మేరకు ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి ఈ సెట్‌ను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాయపర్తి మండల పార్టీ నాయకులు, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, మహిళలు పాల్గొన్నారు.