హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ వినియోగదారులపై ట్రూ అప్ ఛార్జీల భారం పడనుంది. నవంబర్ నుంచి యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి యూనిట్‌కు 50 పైసలు చొప్పున వసూలు చేసేందుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతించినట్లు సమాచారం. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (SPDCL) 29 నెలలు, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (NPDCL) 26 నెలలపాటు ఈ ఛార్జీలను వసూలు చేయనున్నాయి.