వరంగల్:రాయపర్తి మండలం కొలనుపెల్లి గ్రామంలోని జింకిరాం తండాలో సోమవారం ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. పాలకుర్తి మండలం గూడూరు గ్రామం నర్సింగాపురం తండాకు చెందిన భూక్య రవి తన భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో టవర్ ఎక్కినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న రాయపర్తి ఎస్సై, సిబ్బంది అక్కడికి చేరుకుని అతడితో మాట్లాడి సురక్షితంగా కిందికి దించారు. దీంతో పరిస్థితి ప్రశాంతంగా మారింది.