హైదరాబాద్: లైసెన్స్ నిబంధనలు, ఫీజుల పెంపుతో ఆర్థిక భారం పెరుగుతోందని నిరసిస్తూ సోమవారం(అక్టోబర్ 5) నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. గతంలో రూ.40 లక్షలుగా ఉన్న లైసెన్స్ ఫీజును రూ.44 లక్షలకు పెంచడంపై అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే ప్రివిలేజ్ సెస్‌ను స్లాబ్ విధానంలో 8 శాతం నుంచి 20 శాతానికి పెంచారని పేర్కొంటూ దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది.