హైదరాబాద్: తెలంగాణ సచివాలయానికి మంచినీటి సరఫరా నిలిచిపోయింది. సుమారు రూ.50 లక్షల వాటర్ బిల్లులు బకాయి ఉండటంతో నీటిని సరఫరా చేసే నాలుగు ప్రైవేట్ ఏజెన్సీలు వాటర్ క్యాన్ల సరఫరా నిలిపివేసినట్లు సమాచారం. పాత బిల్లులు చెల్లిస్తేనే సరఫరా పునరుద్ధరిస్తామని కాంట్రాక్టర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగులు, సిబ్బంది తమ వాటర్ బాటిళ్లు, క్యాన్లు తామే తెచ్చుకోవాలని ఆయా పేషీల అధికారులు సూచించినట్లు సమాచారం.