🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 05 October 2026, 9:02 am Posted by : satla anil kumar

కేజీబీవీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

News Image
వర్ధన్నపేట మండలం ఇల్లందలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పాఠశాలను సందర్శించిన కలెక్టర్.. విద్యార్థులకు అందుతున్న విద్య, వసతి, భోజనం, పారిశుధ్య సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి చదువు, వసతి గృహంలో సౌకర్యాలు, భోజనం నాణ్యత, పాఠశాలలో అందుతున్న ఇతర సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు కేజీబీవీలో ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్‌ను కూడా పరిశీలించారు. అందులో విద్యార్థులు పేర్కొన్న ఫిర్యాదులు, సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, పౌష్టికాహారం అందేలా
🏠 Home