వరంగల్:సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. వార్డు సభ్యుడు రౌతు అనిల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ కండువాలు కప్పుకున్నారు. కాంగ్రెస్ గ్రామ ఉపాధ్యక్షుడు రౌతు శివకోటి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు రౌతు వరదరాజుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు చేరారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతోనే నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. పార్టీ బలోపేతానికి సమష్టిగా పనిచేయాలని సూచించారు.