వరంగల్:ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు తీసుకుని, తిరిగి అడిగితే బెదిరింపులకు పాల్పడిన రౌడీషీటర్‌ను ఎనుమాముల పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పైడిపల్లికి చెందిన వడ్డ మానుకోట తిరుపతి రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని చంద్రకళ కుటుంబ సభ్యుల నుంచి రూ.6 లక్షలు తీసుకున్నట్లు సీఐ సురేశ్ తెలిపారు. ఉద్యోగం ఇప్పించకపోవడంతో డబ్బులు అడిగేందుకు వెళ్లిన బాధితులను దుర్భాషలాడి, బెదిరించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి తిరుపతిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.