🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 05 October 2026, 8:29 am Posted by : Telangana Gontuka

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

News Image
హన్మకొండ: అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శాయంపేట మండలం నేరేడుపల్లికి చెందిన అడుప నాగరాజు (38) ఏడాది క్రితం ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా ప్రమాదానికి గురై కాలికి తీవ్ర గాయమైంది. పలుమార్లు శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ ఇన్‌ఫెక్షన్‌ తగ్గకపోవడంతో కాలు తొలగించాలని వైద్యులు సూచించారు. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పరమేశ్వర్ తెలిపారు.
🏠 Home