🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 04 October 2026, 10:03 am Posted by : Telangana Gontuka

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మరిపెడ యువతి మృతి

News Image
మహబూబాబాద్:అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన దారం సుప్రజ మృతి చెందారు. సెయింట్ లూయిస్‌లో రెస్టారెంట్ నిర్వహిస్తున్న సుప్రజ.. శనివారం రాత్రి రెస్టారెంట్ మూసివేసిన అనంతరం స్నేహితురాలితో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో వారి కారును ట్రక్ బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సుప్రజ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమెతో పాటు కారులో ప్రయాణిస్తున్న స్నేహితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుప్రజ మృతితో మరిపెడలోని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు.
🏠 Home