వరంగల్:పర్వతగిరి మండలంలోని అనంతారం శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. ఎస్‌ఐ బొగం ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో రూ.1,29,490 నగదు, ఒక ఐ20 కారు, ఏడు బైక్‌లు, ఎనిమిది సెల్‌ఫోన్లు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పేకాట, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.